FbTelugu

టీటీడీపై బీజేపీ, టీడీపీ నాటకాలు: ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి

బీజేపీ నేత భానుప్రకాశ్ రెడ్డి సమాధానం చెప్పాలి

మాజీ మంత్రి మాణిక్యాల రావు అప్పడు ఏం చేశారు

బీజేపీ నేతలు క్షమాపణలు చెప్పాలి

జగన్ క్రిస్టియన్ అయితే విమర్శిస్తారా?

ఢిల్లీ: తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తుల అమ్మకం పై బీజేపీ, టీడీపీ లు అనవసర రాజకీయాలు చేస్తున్నాయని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి విరుచుకుపడ్డారు.

టీటీడీపై లేనిపోని రాద్దాంతం చేస్తున్న బీజేపీ నేతలు క్షమాపణలు చెప్పాలన్నారు. ఆస్తుల రక్షణ పేరుతో బీజేపీ నేతలు ఉపవాస దీక్షలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి ఒక ప్రైవేటు ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడారు. దేవుడిపైన అబద్ధాలు చెప్ప రాదు, రాజకీయాల్లో నిజాయితీ ముఖ్యమన్నారు. అబద్ధాలు చెబితే ఏనాడైనా దొరికిపోతారని ఆయన అన్నారు.

2016లో టీడీపీ, బీజేపీ పార్టీలు సంయుక్తంగా టీటీడీ ఆస్తులు విక్రయించాలని పాలక మండలిలో నిర్ణయం తీసుకున్నాయన్నారు. బీజేపీ నాయకుడు భాను ప్రకాష్ రెడ్డి ఆ కమిటీలో సభ్యుడిగా ఉన్నారని ఆయన గుర్తు చేశారు. అప్పుడు బీజేపీ ఎమ్మెల్యే అయిన పైడికొండల మాణిక్యాల రావు ఏపీ దేవాదాయ శాఖకు మంత్రిగా కూడా ఉన్నారు. చంద్రబాబు నాయుడు హయాంలోనే ఈ నిర్ణయాలు తీసుకున్నారని సుబ్రహ్మణ్య స్వామి ఆరోపించారు.

ఏపీ సీఎం వైఎస్.జగన్ విశ్వసనీయత కలిగిన వ్యక్తి అని కొనియాడారు. చెప్పింది చేసే నాయకుడు అని, సూటిగా మాట్లాడే మనస్తత్వం ఉన్న వ్యక్తి అని కీర్తించారు. క్రిస్టియన్ అయినంత మాత్రాన ఆయన పైన, ప్రభుత్వం పైన బీజేపీ, టీడీపీ నేతలు బురద జల్లడం మంచిది కాదన్నారు. టీటీడీ ఆస్తుల విక్రయాల విషయంలో పాలక మండలి తీర్మానాన్ని నిలుపుదల చేస్తూ తీసుకున్న నిర్ణయం పై జగన్ కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. తిరుమల ఆస్తులను అమ్మకూడదని, వాటిని ఇతర కార్యక్రమాలకు ఉపయోగించాలని సుబ్రహ్మణ్య స్వామి సూచించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.