చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీచేసేందుకు ఎఐఏడీఎంకె, బీజేపీ పార్టీల మధ్య పొత్తు కుదిరింది. రెండు పార్టీలు కలిసి ఎంపిక చేసిన నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.
రాష్ట్ర అసెంబ్లీలో మొత్తం సీట్లు 234 ఉన్నాయి. ఎఐఏడీఎంకె పార్టీకి చెందిన ఎడప్పాడి పళనీ స్వామి, ఓ.పన్నీర్ సెల్వం, బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జీ సీటీ రవి, రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఎల్.మురుగన్ లు సీట్ల పంపకాల అగ్రిమెంట్ పై సంతకాలు చేశారు. బీజేపీకి 20 సీట్లు ఇవ్వాలని నిర్ణయించారు. మిగతా సీట్లలో ఎఐఏడీఎంకె అభ్యర్థులు పోటీ చేయనున్నారు. పొత్తు ఖరారు కావడంతో ఎఐఏడీఎంకె పార్టీ అభ్యర్థుల మొదటి జాబితాను శుక్రవారం నాడు విడుదల చేశారు. ఇందులో సీఎం పళనీ స్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం పేర్లు ఉన్నాయి.