FbTelugu

అడ్వకేట్ల హత్య కేసులో బిట్టు శ్రీను అరెస్టు

పెద్దపల్లి: పెద్దపల్లి జడ్పీ ఛైర్ పర్సన్ పుట్ట మధు మేనల్లుడు తులిసెగారి శ్రీను అలియాస్  బిట్టు శ్రీనివాస్ ను పోలీసులు అరెస్టు చేశారు. మంథనిలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు.

అడ్వకేట్లు గట్టు వామన్ రావు, పివి.నాగమణి హత్య చేసేందుకు నిందితులు వాడిన కత్తులను బిట్టు శ్రీను సమకూర్చినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ విషయాన్ని గురువారం నాడు ఐజీ నాగిరెడ్డి మీడియా ముందు వెల్లడించారు. అతను ఇంకా పట్టుబడలేదని, దొరికితే మరిన్ని వివరాలు బహిర్గతమవుతాయని తెలిపారు. బిట్టు శ్రీను తన కారుతో పాటు కొబ్బరి బొండాలు నరికే రెండు కత్తులను సమకూర్చాడు. ఇవాళ పోలీసులు మంథనిలో శ్రీనును అదుపులోకి తీసుకున్నారు. జడ్పీ ఛైర్ పర్సన్ పుట్టా మధు మేనల్లుడే బిట్టు శ్రీను కావడంతో ఈ కేసు ప్రాధాన్యత సంతరించుకున్నది. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.