FbTelugu

బిత్తిరి సత్తి దారెటు?

తీన్మార్ వార్తలతో సుపరిచితుడై ప్రస్తుతం ఇస్మార్ట్ శంకర్ గా రాణిస్తున్న బిత్తిరి సత్తి అలియాస్ చేవెళ్ల రవికుమార్ దారెటు అనేది స్పష్టం కావడం లేదు.

గొంతెమ్మ కోర్కెలు పెట్టడం మూలంగానే టీవీ 9 యాజమాన్యం తొలగించిందని కొందరు అంటుండగా, మరికొందరు అదేమీ లేదు… బిగ్ బాస్ సీజన్ 4 కోసం సత్తి బయటకు వచ్చారని అంటున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా బిగ్ బాస్ సీజన్ 4 ఈ ఏడాది చివరకు వాయిదా పడిందంటున్నారు.

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన రవికుమార్ కు తొలుత వీ6 టీవీ యాజమాన్యం అవకాశం కల్పించింది. తెలంగాణ యాసతో తనదైన శైలిలో బిత్తిరి సత్తి గా తీన్మార్ వార్తల్లో అలరించారు. కొద్ది రోజుల క్రితం వీ6 ఛానల్ నుంచి బయటకు వచ్చి టీవీ9 లో చేరిపోయాడు. ఇస్మార్ట్ శంకర్ పాపులర్ కావడంతో తన రెమ్యునరేషన్ పెంచాలని డిమాండ్ చేశాడని అంటున్నారు. పైగా స్కిట్స్ విషయంలో సొంత నిర్ణయాలు తీసుకోవడం, హెచ్చరించినప్పటికీ విన్పించుకోకపోవడంతో తొలగించినట్లు చర్చ జరుగుతోంది.

ఏది ఏమైనా కొద్ది రోజులు ఆగితే తప్ప స్పష్టత వచ్చే అవకాశాలు లేవు. తనను ఈ స్థాయికి తీసుకువచ్చిన వీ6 వద్దకు వెళ్తాడా లేదా బిగ్ బాస్ సీజ్ 4 కోసం ఎదురు చూస్తాడా అనేది కాలమే నిర్ణయించాలి.

You might also like