చెన్నై: వేడి వేడి టీ లో బిస్కట్లు వేసుకుని తినడం చూశాం. చూస్తున్నాం కూడా. అయితే బిస్కట్ కప్పు… టీ ని తాగితే ఆ మజానే వేరు అంటున్నాడు మధురై టీ కొట్టు యజమాని. అదేంటో మనం తెలుసుకుందాం.
టీ తాగేటప్పుడు బిస్కట్లు వేసుకుని, ముంచుకుని తినడం చాలా మందికి అలవాటు. ఇది చిన్నతనం నుంచే మొదలవుతుంది కూడా. ఈ రెంటి కాంబినేషన్ ను మరింత పటిష్టం చేసేందుకు తమిళనాడులోని మధురై టీ బంకు యజమాని ప్రయత్నాలు మొదలు పెట్టారు. బిస్కెట్ తయారు చేసే పదార్థాలతోనే టీ కప్పులు తయారు చేయించాడు. వెరైటీగా తీసుకువచ్చిన బిస్కట్ కప్పులో టీ పోసి ఇస్తున్నాడు. దీనికోసం ఆర్ఎస్ పాతి నీలగిరి టీ స్టాల్ లో దీని కోసం జనం ఎగబడుతున్నారు.
ఈ టీ స్టాల్ 1909 ను నడుస్తోంది. ప్లాస్టిక్ వస్తువులు పూర్తిగా నిషేధిస్తున్న తరుణంలో ఈ ఐడియా వచ్చినట్లు యజమాని వివేక్ సబాపతి తెలిపారు. తినతగిన బిస్కెట్ టీ ధ రూ.20లు మాత్రమేనన్నారు. కప్పులో పోసిన పది నిమిషాల్లోనే టీ తాగాలని లేదంటే ముద్ద అవుతుందని ఆయన వివరించారు. దీనిలో మరిన్ని ఫ్లేవర్స్ తీసుకురావాలని యోచిస్తున్నామని వివేక్ వెల్లడించారు.