FbTelugu

బర్త్ డే పార్టీ.. మాస్క్ లేని మంత్రికి కరోనా

ముంబయి: మహారాష్ట్రలో కొద్ది రోజులుగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. పెరుగుతున్న కేసుల సంఖ్య చూసి ప్రభుత్వ పెద్దలే హడలిపోతున్నారు. వందల్లో నమోదవుతున్న కేసులు వేలకు పెరగడం చర్చనీయాంశంగా మారింది.

కేసులు పెరుగుతున్న జనాలు మాస్కులు ధరించడం లేదు. భౌతిక దూరం కూడా పాటించడం లేదు. ఎంతగా ఫెనాల్టీలు వేసినా పట్టించుకోవడం లేదు. మాస్కులు ధరించకుండా, భౌతిక దూరం పాటించకుండా నిర్వహించిన బర్త్ డే పార్టీలో పాల్గొన్న మంత్రికి కరోనా పాజిటివ్ నిర్థారణ అయ్యింది. మహారాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి జయంత్ పాటిల్ ఫిబ్రవరి 16న బర్త్ డే జరుపుకున్నారు. ముంబయి మలద్ ఎస్టేట్ లో జరిగిన వేడుకలకు కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యారు. మాస్కులు ధరించలేని సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్ అయ్యాయి. అనుకున్నట్లుగా ఆయనకు ఇవాళ కరోనా పాజిటివ్ నిర్థారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్వీట్ చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.