FbTelugu

రోగుల మధ్య బాలయ్య జన్మదిన వేడుకలు

హైదరాబాద్: బంజారాహిల్స్ లోని ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ లో హీరో, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు జరుపుకున్నారు.

ఇవాళ 60వ పడిలోకి ప్రవేశించిన బాలకృష్ణ హాస్పిటల్ ఆవరణలో తల్లిదండ్రులు ఎన్టీఆర్, బసవతారకం విగ్రహానికి నమస్కరించి, నివాళులు అర్పించారు. ఆ తరువాత క్యాన్సర్ రోగుల మధ్య తన జన్మదిన కేక్ ను కట్ చేశారు. కరోనా కారణంగా అభిమానుల మధ్య వేడుకలు జరుపుకోలేకపోతున్నట్లు బాలకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు.

అంతకు ముందు బాలకృష్ణ నివాసానికి మాజీ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు దంపతులు స్వయంగా వెళ్లి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

You might also like