FbTelugu

హిమాచల్ ప్రదేశ్ కు వ్యాపించిన బర్డ్ ఫ్లూ

* కాకులు, నెమళ్లు, బాతులు, కోళ్లపై తీవ్ర ప్రభావం
సిమ్లా: భారత్ లో ఓ పక్క కరోనాతో ప్రజలు ఉక్కిబిక్కిరి అవుతుండగా.. కరోనా కొత్త వైరస్ స్ట్రెయిన్ తీవ్ర భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఇంతటి కష్టకాలంలో దేశంలో బర్డ్ ఫ్లూ వైరస్ తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.

ఇప్పటికే మధ్యప్రదేశ్, రాజస్థాన్ లో తీవ్రంగా వ్యాప్తించడంతో అక్కడి కాకులు, నెమళ్లు వందల సంఖ్యలో చనిపోతున్నాయి. తాజాగా బర్డ్ ఫ్లూ కేరళ, హిమాచల్ ప్రదేశ్ లో వ్యాపిస్తోంది. ఈ వైరస్ దాటికి కాకులు, నెమళ్లు, బాతులు, కోళ్లు భారీగా చనిపోతున్నాయి. పలు ప్రాంతాల్లో చికెన్, గుడ్లపై నిషేధం విధించారు. మిగతా రాష్ట్రాలు, ముఖ్యంగా పౌల్ట్రీ పరిశ్రమలు జాగ్రత్తలు పాటించాలంటూ ఇప్పటికే కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.