FbTelugu

బైక్ సెలెన్సర్లను రోడ్డు రోలర్ తో తొక్కించారు…

రాజమహేంద్రవరం: బులెట్లు, ఖరీదైన టూ వీలర్లకు రణగొణ ధ్వనులు విన్పించే సైలెన్సర్ల కారణంగా రోడ్లు మీద వెళ్లేవారు ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఫిర్యాదులు ఎక్కువకావడంతో రాజమహేంద్రవరంలో ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తారు.

ట్రాఫిక్ డిఎస్పి కెవిఎన్.వరప్రసాద్ ఆధ్వర్యంలో ఇవాళ నగరం లో 74 సైలెన్సర్లను బైక్ ల నుంచి తీయించారు. పర్యావరణ నిబంధనల కన్నా ఎక్కువ మోత వస్తున్న ఈ వాహన యజమానులపై రూ.74వేలు చలాన విధించారు. ఆ తరువాత రోడ్డుపై సైలెన్సర్లను పేర్చి రోడ్డు రోలర్ తో తొక్కించారు. ఇక నుంచి ఎవరైనా ఇలాంటివి వాడినా, వాటిని విక్రయించినా చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుందని, ఆగదని డిఎస్పి వరప్రసాద్ స్పష్టం చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.