FbTelugu

బైకు రేసింగ్… దాడి చేసిన యువకులు

హైదరాబాద్: కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు సమీపంలోని ప్రగతి నగర్ లో ఇరవై మంది యువకులు ఒక కుటుంబంపై మూకుమ్మడి దాడి చేశారు. తీవ్ర గాయాల పాలైన వారు బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఇంటి ముందు నుండి బైక్ పై మితిమీరిన వేగంతో వెళుతున్న యువకులను ప్రశ్నించిన పాపానికి ఓ కుటుంబ పై దాడికి దిగారు. రోడ్డు నీ అయ్యదా? నీ అమ్మదా? బయట ఎందుకు కూర్చున్నారంటూ 20 మంది యువకులు కుటుంబం పై విచక్షణారహితంగా దాడి చేశారు. వీరి దాడిలో పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఆపై కులం పేరుతో దూషిస్తూ దాడి చేసారంటూ బాధితులు బాచుపల్లి పోలీసులకు పిర్యాదు చేశారు. మితిమీరిన వేగంతో బైక్ నడపవద్దు అన్న పాపానికి 20 మంది అకారణంగా మాపై దాడి చేశారని పోలీసులకు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.