రంగారెడ్డి : కాలినడకన వెళుతున్న ఓ మహిళను బైకు ఢీకొని మహిళతో పాటూ బైక్ పై ఉన్న యువకుడు కూడా మృతి చెందిన ఘటన నగర శివారులోని శంషాబాద్లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక పెద్ద తుప్పర వద్ద ఓ మహిళ నడుచుకుంటూ వెళ్తుండగా..
వేగంగా వచ్చిన ఓ మోటార్ సైకిల్ బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో మహిళ అక్కడికక్కడే మృతి చెందగా.. బైక్పై వెళ్తున్న యువకుడు తీవ్ర గాయాలపాలై మృతి చెందాడు. యువకుడు మద్యం మత్తులో బైకు నడిపినట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.