FbTelugu

ఇద్దరు యువకులను బలిగొన్న బైకుప్రమాదం

* వివాహానికి వెళ్లి వస్తుండగా ఘటన
ఖమ్మం: బైక్ ప్రమాదంలో ఇద్దరు యువకులు మృత్యువాత పడిన ఘటన జిల్లాలోని కామేపల్లి మండలం పొన్నెకల్‌ గ్రామశివారులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

పండితాపురం గ్రామానికి చెందిన సాయి(23), వెంకటేశ్‌(24) అనే ఇద్దరు యువకులు స్నేహితుని వివాహానికి వెళ్లి బైకుపై వస్తుండగా.. స్థానిక పొన్నెకల్‌ గ్రామశివారులో వేగంగా వచ్చిన ఓ బైకు అదుపుతప్పి పక్కనే ఉన్న ఓ చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో బైకుపై ఉన్న ఇద్దరు యువకులూ అక్కడికక్కడే మృతి చెందారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.