FbTelugu

బిహార్ సిఎస్ అరుణ్ కరోనాతో మృతి

పాట్నా: రాష్ట్ర ప్రభుత్వంలోనే ఆయన అత్యున్నత స్థాయి అధికారి. అయితేనేమి ఆయనకు కరోనా పాజిటివ్ సోకడంతో మరణించారు. ఆయనే బిహార్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అరుణ్ కుమార్ సింగ్.

కరోనాతో ఆసుపత్రిలో పోరాడుతూ శుక్రవారం నాడు తుదిశ్వాస విడిచారు. 1985 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి అరుణ్ కుమార్ సింగ్ ది బిహార్ క్యాడర్. నితీష్ కుమార్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తరువాత ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో ఈయన ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. అరుణ్ కుమార్ సింగ్ మృతిపై సిఎం నితీష్ కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం పరిపాలనా రంగానికి తీరని లోటని కొనియాడారు. 

You might also like

Leave A Reply

Your email address will not be published.