FbTelugu

బిగ్ బాస్ ఫైనల్ మరింత ఆసక్తిగా ఉంటుంది…

బిగ్ బాస్ సీజన్ 4 మరింత ఆసక్తిగా ఉంటుందని, ఈ సీజన్ కు వ్యాఖ్యాతగా వ్యవహరించడం ఆనందంగా, సంతృప్తిగా ఉందని హీరో అక్కినేని నాగార్జున తెలిపారు. ప్రతివారం కోట్లాది మంది వీక్షకులకు వినోదం కల్గించడమే తన లక్ష్యమన్నారు.

ఈ ఏడాది సెప్టెంబర్ 6వ తేదీన ప్రారంభమైన షో మరో రెండు వారాల్లో ముగియనున్నది. వైల్డ్ కార్డు ఎంట్రీ సహా ఇప్పటి వరకు బిగ్ బాస్ హౌస్ లోకి 19 మంది అడుగు పెట్టగా, ఆరుగురు మాత్రమే మిగిలారు. విభిన్న నేపథ్యం నుంచి వచ్చిన కంటెస్టెంట్లతో షో కోట్లాది మందిని ఆకట్టుకున్నది. క్లైమాక్స్ ను కూడా వీక్షించేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆంధ్రా, తెలంగాణలో సుమారు 4 కోట్ల మందికి పైగా వీక్షకులు వీక్షించడం వారికున్న ప్రేమకు నిదర్శనమని నాగార్జున వ్యాఖ్యానించారు. ఈ షో ఫైనల్ మరింత అద్భుతంగా ఉంటుందని అన్నారు. ఇప్పటి వరకు ప్రసారం చేసిన షో ను రాత్రి 9.30 గంటల నుంచి 10 గంటలకు మార్చింది. వదినమ్మ సీరియల్ కోసం ఈ మార్పు చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.