FbTelugu

బిగ్‌బాస్-3 విన్నర్ రాహుల్.. రన్నర్ శ్రీముఖి

Bigboss3-Winner-Rahul-Runner-Srimukhi

హైదరాబాద్: బిగ్ బాస్ మూడో సీజన్ టైటిల్ ను గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ గెలుచుకోగా.. రన్నర్ గా శ్రీముఖి నిలిచింది. దాదాపు మూడు నెలల పాటు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులను ఉర్రూతలూగించిన బిగ్‌బాస్ 3 లో మెగాస్టార్ చిరంజీవి సమక్షంలో రాహుల్ విజేతగా నిలిచినట్టు హోస్ట్ నాగార్జున ప్రకటించారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ తనకు ఇంత పెద్దమొత్తంలో ఓట్లు వేసి గెలిపించిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల ప్రజలకు పాదాభివందనాలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక మైక్ చేతికి అందగానే విజేత రాహుల్ భావోద్వేగాలు ఆపుకోలేక హెచ్చుస్థాయిలో మాట్లాడాడు.

You might also like