FbTelugu

గుండెపోటుతో పెద్దపులి మృతి

పది రోజుల వ్యవధిలో రెండు పులుల కన్నుమూత!
హైదరాబాద్: నెహ్రూ జూలాజికల్ పార్క్ లో కదంబ అనే పెద్ద పులి చనిపోయింది. రాయల్ బెంగాల్ టైగర్ వర్గానికి చెందిన మగపులి వయస్సు 11 సంవత్సరాలు.
కదంబ ఎలాంటి అనారోగ్య లక్షణాలు కనబర్చలేదని, అయితే తరచుగా ఆహారం తీసుకునేది కాదని జూ వర్గాలు తెలిపాయి. ఆహారం తీసుకోకపోవడంతో కొద్ది రోజులుగా జూ వైద్యుల పర్యవేక్షణలో ఉంచామని అధికారులు వెల్లడించారు. అయినప్పటికీ మృతి చెందిందని అధికారులు తెలిపారు. పోస్టుమార్టం నిర్వహిస్తే విషాదకరమైన విషయం తెలిసిందని అన్నారు. కదంబ హార్ట్ ఫెయిల్యూర్ తో చనిపోయినట్టు వైద్య నిపుణులు తేల్చారని జూ అధికారులు తెలిపారు.

కదంబను 2014లో కర్ణాటకలోని పిలుకుల బయోలాజికల్ పార్క్ నుంచి హైదరాబాద్ జూకి తీసుకువచ్చారు. జూలో గత 10 రోజుల వ్యవధిలో పెద్ద పులులు మృత్యువాత పడడం ఇది రెండోసారి.

You might also like

Leave A Reply

Your email address will not be published.