FbTelugu

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కు మహా షాక్!

ముంబై: బాలీవుడ్ హీరోయిన్, ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కు మహారాష్ట్ర ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. ఇప్పటికే కార్యాలయాన్ని కూల్చేసిన సర్కార్, డ్రగ్ వినియోగంపై దర్యాప్తు చేయాలని ముంబై పోలీసులను ఆదేశించింది.

మత్తుకోసం నిషేధించిన పదార్థాలు, డ్రగ్స్ ను వాడతారనే ఆరోపణలపై నిజానిజాలను తేల్చాలని స్పష్టం చేసింది. కంగనా జోష్ కోసం, ఊపు కోసం కొకైన్ వాడతారనే ఆరోపణలు ఉన్నాయి. 2016లో నటుడు సుమన్ అధ్యయన్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇదే విషయాన్ని అసెంబ్లీలో మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్ వివరించారు.

ప్రభుత్వ ఆదేశాలు వచ్చిన తరువాత కంగనా రనౌత్ కొకైన్ వినియోగంపై దర్యాప్తు ప్రారంభించనున్నారు. ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)తో దర్యాప్తు చేయాలా, యాంటీ నార్కొటిక్స్ అప్పగించాలా అనే దానపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ప్రభుత్వ ఆదేశాలపై విచారణకు హాజరు కావాల్సిందిగా నటి కంగనాతో పాటు సుమన్ అధ్యయన్ కు నోటీసులు జారీ చేయనున్నారు.

You might also like