FbTelugu

బీజింగ్ బిలియనీర్ల సామ్రాజ్యం

న్యూయార్క్: కమ్యూనిస్టు దేశం చైనా సంపన్న దేశం అమెరికాకు సవాల్ విసురుతునే ఉన్నది. బలిసిన ధనవంతులు ఎక్కడున్నారు అంటే అమెరికా దేశం లేదా బ్రిటన్ పేరు చెప్పుకునే వాళ్లం. కాలం మారింది మరి.

ఆ స్థానాన్ని ఇప్పుడు చైనా దేశం ఆక్రమించింది. గత ఏడు సంవత్సరాలుగా ప్రపంచ ధనవంతుల రాజధానిగా ఒక వెలుగు వెలిగిన న్యూయార్క్ నగరం ఇప్పుడు రెండో స్థానంలోకి నెట్టబడింది. 2020 లో బిలియనీర్స్ క్యాపిటల్ హోదాను బీజింగ్ చేజిక్కించుకున్నది. ఫోర్బ్స్ వరల్డ్ బిలియనీర్ జాబితా ప్రకారం బీజింగ్ లో వందం మంది ఉండగా న్యూయార్క్ లో కేవలం 99 మంది మాత్రమే ఉన్నారు. ఈ జాబితాలో మొత్తం 2755 మంది సంపన్నులు ఉండగా అందులో 25 శాతం మంది మాత్రం పది నగరాల్లో నివసిస్తున్నారు. రూ.7400 కోట్లు అంతకన్నా ఎక్కువ సంపద ఉన్నవారికి మాత్రమే ఈ జాబితాలో చోటు దక్కడం విశేషం. న్యూయార్క్ లో అత్యంత ధనవంతుడిగా మాజీ మేయర్స్ బ్లంబర్గ్ కంపెన్ అధినేత బైఖేల్, బీజింగ్ లో జాంగ్ ఇమింగ్ ఉన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.