FbTelugu

భారత్ డెల్టా తో ప్రమాదం: బైడెన్ హెచ్చరిక

వాషింగ్టన్: అమెరికాలో కరోనా డెల్టా వైరస్ కేసులు వెలుగు చూస్తున్నాయని, ఈ కొత్త రకం వైరస్ తో జాగ్రత్తగా ఉండాలని ఆ దేశ అధ్యక్షుడు జోసెఫ్ ఆర్.బైడెన్ హెచ్చరించారు. దీని ముప్పు నుంచి తప్పించుకునేందుకు వ్యాక్సిన్ చేయించుకోని వారు ఇకనైనా వేయించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

భారత్ లో వెలుగు చూసిన డెల్టా వైరస్ యావత్ ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేస్తున్నది, బ్రిటన్ దేశాన్ని గడగడలాడిస్తున్నదన్నారు. ఈ రకాన్ని ఇటీవలే ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) కూడా గుర్తించిందన్నారు. ఇది వేగంగా వ్యాప్తి చెందడమే కాకుండా కనుగొనే లోపే ప్రాణాలు పోతున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారన్నారు. ముఖ్యంగా యువకుల్లో ఈ డెల్టా రకం అధిక ప్రభావం చూపిస్తున్నదని బెడెన్ వివరించారు. తను అధికారం చేపట్టిన సమయంలో కరోనా విజృంభిస్తున్నదని, ఇప్పుడు వైరస్ క్రమంగా తగ్గుముఖం పట్టిందన్నారు. 150 రోజుల్లో 300 మిలియన్ డోసులు వ్యాక్సిన్ ఇచ్చినట్లు ఆయన చెప్పారు. వ్యాక్సినేషన్ మూలంగా ఆసుపత్రులలో రద్దీ తగ్గిందని, మరణాలు కూడా తగ్గిపోయాయన్నారు. వ్యాక్సిన్ వేసుకోని ప్రాంతాల్లోనే పాజిటివ్ కేసులు వస్తున్నాయని బైడెన్ అన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.