FbTelugu

రష్యాను టార్గెట్ చేసిన బైడెన్

లండన్: యుఎస్ ప్రెసిడెంట్ జోసెఫర్ ఆర్.బైడెన్ తన శతృదేశం రష్యాకు చెక్ పెట్టే ప్రయత్నాలు మొదలుపెట్టారు. రష్యా ఏదైనా హాని కలిగించే పనులు చేస్తే ఆ దేశం తగిన గుణపాఠం ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.
బుధవారం బ్రిటన్ చేరుకున్న బైడెన్ ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ తో భేటీ కానున్నారు. 8 రోజుల పర్యటన నిమిత్తం ఆయన యూరప్ దేశాలకు బయలుదేరారు.

లండన్ లోని విండ్సర్ క్యాజిల్ లో క్వీన్ ఎలిజిబెత్ ను మర్యాదపూర్వకంగా కలవనున్నారు. ఆ తరువాత జి7 దేశాధినేత సమావేశానికి హాజరవుతారు. అమెరికా అధ్యక్షుడి హోదాలో తొలిసారి నాటో సమావేశంలో పాల్గొననున్నారు. జెనివాలో జరిగే ఒక సమావేశంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ తో బైడెన్ సమావేశం కానున్నారు. ఆయుధ నియంత్రణ, వాతావరణ మార్పులు, ఉక్రెయిన్ లో రష్యా జోక్యం, సైబర్ హ్యాకింగ్, అలెక్సెల్ నవాల్ని జైలు శిక్ష వంటి అంశాలపై బైడెన్ రష్యా అధ్యక్షుడితో చర్చించి ఒత్తిడి పెంచే అవకాశాలు ఉన్నాయి. తన తొలి విదేశీ పర్యటనలో అమెరికా అధ్యక్షుడు రష్యా ను టార్గెట్ చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.