FbTelugu

కరోనా నియంత్రణపై బైడెన్ మరింత కఠినం

వాషింగ్టన్: కరోనా వైరస్ నియంత్రణకు ప్రజలందరూ నిబంధనలు పాటించాలని, ఇది ఎంతమాత్రం రాజకీయం కాదని అమెరికా అధ్యక్షుడు జోసెఫ్ ఆర్.బైడెన్ స్పష్టం చేశారు. కరోనా నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు, అమెరికా వ్యాధుల నియంత్రణ సంస్థ హెచ్చరికలపై ఆయన వైట్ హౌస్ లో మీడియాతో మాట్లాడారు.

ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా వైరస్ ముప్పు పెరుగుతుందని, జనం కకావికలం అవుతారని అమెరికా వ్యాధుల నియంత్రణ సంస్థ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఈ హెచ్చరికలతో బైడెన్ అప్రమత్తమై చర్యలకు ఉపక్రమించారు. మాస్క్ ప్రతి ఒక్కరు కచ్చితంగా ధరించాలని, ఎవరైనా సడలించినట్లయితే మళ్లీ తప్పనిసరి చేయాలని ఆయన అన్ని రాష్ట్రా గవర్నర్లకు ఆయన స్పష్టం చేశారు. కొందరు మాస్క్ లేకుండా, భౌతిక దూరం పాటించకుండా తిరుగుతున్నారని, టెలివిజన్లలో స్వయంగా వీక్షించానని బైడెన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మాస్క్ ధరించడం ప్రతి ఒక్కరు దేశభక్తిగా భావించాలన్నారు. వ్యాక్సిన్ ను మరింత మందికి విస్తరిస్తూ చేపట్టిన ప్రణాళికను ఆయన ప్రకటించారు. ఏప్రిల్ 19వ తేదీనాటికి వయోజనుల్లో 90 శాతం మందికి ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరికి ఐదు మైళ్ల సమీపంలోనే వ్యాక్సినేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ వారంలో 33 మిలియన్ల వ్యాక్సిన్ డోసులు సిద్ధమవుతాయని, వాటిలో జాన్సన్ అండ్ జాన్స్ కు చెందినవి 11 మిలియన్ డోసులు ఉన్నాయన్నారు. జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ అయితే సింగిల్ డోసు సరిపోతుంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.