FbTelugu

ట్రంప్ మద్దతుదారుల తీరుపై బైడెన్ ఆగ్రహం

వాషింగ్టన్‌ : అమెరికా క్యాపిటల్‌ భవనం వద్ద నిన్న నూతన అధ్యక్షుడి ఎన్నికను ధ్రువీకరించేందుకు జరిగిన అమెరికన్ కాంగ్రెస్ సమావేశంలో ట్రంప్ మద్దతుదారులు తీరుపై ఎలెక్టెడ్‌ ప్రెసిడెంట్‌ జోబైడెన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విల్మింగ్టన్‌లో ఆయన మాట్లాడుతూ..

ట్రంప్‌ మద్దతు దారులు చేపట్టినది నిరసన కాదని తిరుగుబాటేనన్నారు. నిరసనకారులు సమావేశ భవనంలోకి చొరబడి ఫర్నీచర్‌, కుర్చీలతో పాటు భవనం అద్దాలను ధ్వంసం చేయడం పట్ల స్పందించారు. వారి దాడి ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా అభివర్ణించారు. కొద్ది మంది ఉగ్రవాదులు చట్టాన్ని ఉల్లంఘించారని.. ఇది దేశద్రోహమన్నారు. ట్రంప్‌ మద్దతుదారులు చేపట్టిన నిరసన హింసాత్మకంగా మారిందన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.