FbTelugu

వావ్… దేశ ప్రధానికి సైకిల్ గిఫ్ట్!

లండన్: తొలి విదేశీ పర్యటనలో అమెరికా అధ్యక్షుడు జోసెఫ్ ఆర్.బైడెన్ బ్రిటన్ దేశాధ్యక్షుడికి ఊహించని బహుమతి అందచేసి ఆశ్చర్యానికి గురి చేశారు. బైడెన్ జి7 సదస్సులో పాల్గొనేందుకు యుకె చేరుకున్నారు.

ఇరు దేశాల అధ్యక్షులు పరస్పరం బహుమతులు ఇచ్చుకున్నారు. బైడెన్ రూ.4.4 లక్షల విలువైన సైకిల్ ను బ్రిటన్ అధ్యక్షుడు బోరిస్ జాన్సన్ కు బహుమతిగా ఇచ్చారు. ప్రతిగా బ్రిటన్ ప్రధాని 19వ శతాబ్ధంలో బానిసత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేసిన ఫ్రెడ్రిక్ డగ్లస్ ఫొటోను బైడెన్ కు బహూకరించారు. సైకిల్ కలర్ కూడా బ్రిటన్ జాతీయ పతాకం రంగులతో తీర్చిదిద్దారు. దీనిపై ఇద్దరు దేశాధినేతలు సంతకాలు చేయడం విశేషం.

You might also like

Leave A Reply

Your email address will not be published.