FbTelugu

కశ్మీర్‌లో వెంకన్న ఆలయ నిర్మాణానికి భూమిపూజ

కాశ్మీర్: కాశ్మీర్ లో వెంకన్న ఆలయం నిర్మాణానికి ఇవాళ భూమి పూజ నిర్వహించారు. ఆలయ నిర్మాణం కోసం 62 ఎకరాలను అక్కడి ప్రభుత్వం లీజు ప్రాతిపదికన కేటాయించింది.

రూ.33.52 కోట్ల వ్యయంతో నిర్మించే ఆలయానికి జమ్మూ కాశ్మీర్‌ లెఫ్టినెంట్ గవర్నర్‌ మనోజ్ సిన్హా, కేంద్ర హోం శాఖ సహాయమంత్రి జి.కిషన్‌రెడ్డి, టిటిడి ఛైర్మన్‌ వైవి.సుబ్బారెడ్డి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో టిటిడి ఈఓ కెఎస్.జవహర్‌ రెడ్డి పాల్గొన్నారు. 18 నెలల్లో దేవాలయ నిర్మాణం పూర్తికానుంది. దేవాలయ ప్రాజెక్ట్‌ లో భాగంగా వేద పాఠశాల, భక్తులకు వసతి సదుపాయాలు కల్పించనున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.