FbTelugu

రేపు అయోధ్య రామ మందిరానికి భూమిపూజ

న్యూఢిల్లీ: రేపే(ఆగస్టు 05) అయోధ్య రామమందిరానికి భూమిపూజ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరు కానున్నారు. రేపు ఉదయం 10:35 కి ప్రధాని లక్నోకి చేరుకోనున్నారు. అక్కడి నుంచి ఉదయం 11:30 కి అయోధ్యలో సాకేత్ కళాశాల మైదానం చేరుకోనున్నారు.

అక్కడి నుంచి 11:40 కి హనుమాన్ గడి చేరుకోనున్నారు. 12:15 కి రామాలయ ప్రాంగణంలో మోదీ పారిజాత మొక్కను నాటనున్నారు. 12:30 కి అయోధ్య రామాలయానికి భూమిపూజ ప్రారంభం కానుంది. 12:44 కి భూమి పూజ, శంకుస్థాపన జరగనున్నాయి. మధ్యాహ్నం 2:20 కి మోదీ తిరుగు ప్రయాణం అవనున్నారు.

You might also like