FbTelugu

హఫీజ్ పేట భూమి మాదే: భూమా విఖ్యాత్ రెడ్డి

హైదరాబాద్: హఫీజ్ పేటలోని సర్వే నెంబర్ 80లో వివాదంలో ఉన్న 50 ఎకరాల భూమి మాదేనని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ సోదరుడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి స్పష్టం చేశారు.

తమ భూమిని కబ్జా చేసి మై హోమ్ అధినేత జోగినపల్లి రామేశ్వర్ రావు కు లీజుకు ఇచ్చారని, సీఎం కేసీఆర్ ఈ విషయంలో తమకు న్యాయం చేయాలని విఖ్యాత్ రెడ్డి డిమాండ్ చేశారు. భూమా కుటుంబాన్ని ఆర్థికంగా, రాజకీయంగా దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఆస్తులు కాజేసే ప్రయత్నం చేస్తున్నారని, తమపై ఆంధ్రాలో, తెలంగాణలో అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారన్నారు. కిడ్నాప్ జరిగిన సమయంలో నిందితులు, బాధితులు ఎక్కడున్నారో విచారించాలన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.