FbTelugu

పవన్ పెద్ద మోసగాడు: ఎమ్మెల్యే శ్రీనివాస్

ఏలూరు: ఒక మనిషి జీవితంలో విడాకులు తీసుకుని ఎన్ని పెళ్లిళ్లు అయినా చేసుకోవచ్చు కాని రాజకీయాల్లో కుదరదని, విలువలు, సిద్ధాంతాలు ముఖ్యమని భీమవరం వైసీపీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ విమర్శించారు.

మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించడంతో ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఇవాళ మీడియాతో మాట్లాడారు. జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. నిన్న, మొన్నటిదాకా కమ్యూనిస్టు పార్టీలను పవన్ మోసం చేశారని ఆయన ఆరోపించారు. టీడీపీతో కలిసి విడిపోయి.. బీజేపీతో కలిసి లోపాయికారిగా కింద స్థాయిలో టీడీపీతో కలిసి పనిచేస్తున్నారని విమర్శించారు. ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు, పవన్ నీచ రాజకీయాలను ప్రజలు తిరస్కరించారని శ్రీనివాస్ అన్నారు. 2019 ఎన్నికల్లో భీమవరం నుంచి జనసేన తరఫున పవన్ కల్యాణ్, వైసీపీ తరఫున గ్రంధి శ్రీనివాస్ పోటీచేశారు. ఈ ఎన్నికల్లో శ్రీనివాస్ విజయం సాధించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.