FbTelugu

ఘనంగా భవానీదీక్ష విరమణ కార్యక్రమం

విజయవాడ: ఇవాళ ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ సన్నిధిలో భవానీ దీక్ష విమరణ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. దుర్గ గుడి స్థానాచార్యులు, ఆలయ అధికారులు ఇవాళ ఉదయం 6:37 గంటలకు మూడు హోమ గుండాలకు అగ్ని ప్రతిష్టాపన చేశారు.

అలాగే అమ్మవారి నేతి టెంకాయలను వేసేందుకు హోమ గుండాలు ఏర్పాటు చేశారు. ఇరుముడి బియ్యం వేసేందుకు 20 కౌంటర్లను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. వినాయకుడి గుడి వద్ద నుండి క్యూలైన్లలో భవానీ భక్తులు కిక్కిరిసిపోయారు. భవానీ దీక్ష విరమణకు లక్షల సంఖ్యలో భవానీలు అమ్మవారి ఆలయానికి తరలివచ్చారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.