FbTelugu

రమణ దీక్షితులు వైసిపి ఏజెంట్: భానుప్రకాశ్ రెడ్డి

నెల్లూరు: తిరుమలలో అన్యమతస్తులు లేరని, ప్రచారం కూడా చేయడం లేదని టిటిడి ముఖ్య ప్రధాన అర్చకులు ఏవి.రమణ దీక్షితులు వ్యాఖ్యానించడం దారుణమని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాశ్ రెడ్డి వ్యాఖ్యానించారు.

అదే విధంగా క్రైస్తవుడు అయిన సిఎం వైఎస్.జగన్మోహన్ రెడ్డిని విష్ణుమూర్తితో పోల్చడం దారుణం అని అన్నారు. ఇవాళ ఆయన నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ, తనను తిరిగి నియామకం చేయడంతో రమణ దీక్షితులు జగన్ మెప్పుకోసం రాజకీయన నాయకుడి వలే మాట్లాడుతున్నారన్నారు. రాజకీయంగా ఏదైనా మాట్లాడాలని రమణ దీక్షితులు భావిస్తే పదవికి రాజీనామా చేసి వైసిపి తరఫున మాట్లాడొచ్చని హితవు పలికారు. హిందువుల విశ్వాసాలు కాలరాసే కుట్ర జరుగుతోందని ఆయన విమర్శించారు. శ్రీవారికి జగన్ దంపతులు ఎందుకు పట్టు వస్త్రాలు సమర్పించడం లేదని ఆయన ప్రశ్నించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.