FbTelugu

కరోనా మృతులపై పందెంరాయుళ్ల బిజీ!

బెంగళూరు: ఇప్పటి వరకు క్రికెట్, గుర్రాలు, కోడి పందేలాపై పందెం కాయడం చూశాం. కరోనా పై అమానవీయంగా పందెం కాస్తూ సొమ్ములు చేసుకుంటున్నారు.

కర్నాటక రాష్ట్రంలో ఈ తరహా బెట్టింగ్ జోరుగా జరుగుతున్నది. కర్ణాటకలోని మైసూరు, చామరాజనగర తదితర ప్రాంతాల్లో ఈ పందాలు జోరుగా సాగుతున్నాయి. దేశంలో ఎన్ని కేసులు నమోదు అవుతున్నాయి, ఎంత మంది చనిపోతున్నారు, కర్నాటకలో ఎంత మందికి వచ్చింది, ఎంత మంది మృతి చెందుతారనే దానిపై పందేలు కాస్తున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం హెల్త్ బులిటన్ విడుదలయ్యే లోగా.. ఈ రోజుకు ఎన్ని కేసులు వస్తాయి? ఏ జిల్లాలో ఎక్కువ కేసులు వస్తాయి? ఎంత మంది మరణిస్తున్నారు? వంటి విషయాలపై బెట్టింగ్ కాస్తున్నారు. ఒక వేళ గెలిస్తే, ఆ వెంటనే అతని ఖాతాలోకి డబ్బులు జమ అవుతున్నాయి. అయితే, ఈ బెట్టింగ్ లు రూ. 100 నుంచి రూ. 1000 వరకూ ఉండడంతో పోలీసులు కూడా పట్టించుకోకుండా వదిలేస్తున్నారు.

You might also like