FbTelugu

నగరంలో బెంజ్ బీభత్సం

హైదరాబాద్: నగరంలోని బంజారాహిల్స్ లో ఓ బెంజ్ కారు బీభత్సం సృష్టిస్తూ ఇతర వాహనాలను ఢీకొట్టింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్, రోడ్ నెం 3 లో ఓ బెంజ్ కారు అతివేగంగా వచ్చి ఓ క్యాబ్ ను ఢీకొట్టింది.

దీంతో క్యాబ్ లో ఉన్న ఇద్దరికి తీవ్రగాయాలైనాయి. అప్పటి వరకు పబ్ లో మద్యం సేవించి డ్రైవ్ చేసినట్టుగా.. పోలీసులు గుర్తించారు. బెంజ్ లో ముగ్గురు యువకులు, ఓ యువతి ఉన్నట్టుగా గుర్తించారు. నిందితులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్టుగా పోలీసులు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.