FbTelugu

వ్యవసాయ బిల్లులతో రైతులకు మేలు: కృష్ణరాజు

అమరావతి: దేశంలో రైతులకు మేలు చేసే వ్యవసాయ బిల్లులు ఆమోదించిన ప్రధాని నరేంద్ర మోదీ కి బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ నాయకుడు కృష్ణ రాజు ధన్యవాదాలు తెలిపారు. కేంద్రం తెచ్చిన నూతన వ్యవసాయ బిల్లు ముఖ్య ఉద్దేశ్యం మధ్య దళారీల నుండి రైతులను రక్షించడమేనన్నారు.

ఈ బిల్లులలతో దేశంలో 80% చిన్న, సన్నకారు రైతులకి లాభం కలుగుతుందన్నారు. దీని ప్రధాన ఉద్దశ్యం మధ్య దళారీలు, కమిషన్ ఏజెంట్లని దూరంగా పెట్టడమేనన్నారు. రైతు తను పండించిన పంటకి తానే ధర నిర్ణయించుకునే వెసులుబాటు వస్తుందన్నారు. పండించిన పంటను దేశంలో ఎక్కడయినా అమ్ముకునే స్వేచ్చని ఇస్తున్నదన్నారు. ఈ బిల్లుల వల్ల నష్టపోయేది కమిషన్ ఏజెంట్లు, పెద్ద ఎత్తున కార్పొరేట్ వ్యవసాయం చేసే వాళ్ళు మాత్రమేని కృష్ణ రాజు తెలిపారు.
మధ్య దళారీలు, మార్కెట్ కమిటీలు నిర్ణయించిన ధర కే పంటను విక్రయించుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో పంటకి వెచ్చించిన ఖర్చు, రవాణా ఛార్జీలు కూడా గిట్టుబాటు అవట్లేదన్నారు. తన పొలం దగ్గరే తనకి నచ్చిన ధరకి అమ్ముకోవచ్చు అని, ఎవరితో నైనా ముoదస్తుగా ఒప్పందం చేసుకొని విక్రయించుకోవచ్చని ఆయన అన్నారు. దీనివలన తన పంటని తన పొలం దగ్గరే అమ్ముకోవడం వల్ల రవాణా ఖర్చు ఉండదు, రోజుల తరబడి మార్కెట్ యార్డుల్లో దళారీలో కోసం ఎదురు చూసేది ఉండదు అని కృష్ణ రాజు తెలిపారు.

అత్యవసర వస్తువుల చట్టం – 2020 నుంచి తృణ ధాన్యాలు, పప్పులు. ఆయిల్ సీడ్స్, వంట నూనెలు, ఉల్లిపాయలు, ఆలుగడ్డలు లాంటి వాటిని తీసేస్తున్నారు. ఇప్పటివరకు వీటిపై రాష్ట్ర ప్రభుత్వాల నియంత్రణ ఉండేది. ఇక నుంచి ఉండదని అన్నారు. అలాగే రైతులు పండించిన తమ పంటని తనకి నచ్చిన ధర వచ్చేవరకు నిల్వ చేసుకోవచ్చన్నారు. వీటి మీద ఎలాంటి ఆంక్షలు ఇక ముందు ఉండబోవు. దీనివల్ల విదేశాలనుండి పెట్టుబడులు వస్తాయని, వ్యవసాయ రంగానికి ప్రైవేట్ సెక్టార్ నుండి నిధులు వస్తాయన్నారు. పెద్ద పెద్ద సంస్థలు తమకి కావాల్సిన పంట కోసం రైతులతో ఒక ధర నిర్ణయం చేసుకొని ముందుగా అడ్వాన్స్ చెల్లిస్తారని ఆయన వివరించారు. మన వ్యవసాయ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వస్తాయని కృష్ణ రాజు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.