FbTelugu

హథీరాంజీ మఠంలో గొంతుకోసుకున్న ఉద్యోగి

తిరుపతి: హథీరాంజీ మఠంలో ఓ ఉద్యోగి గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన జిల్లాలో తీవ్ర కలకలం రేపుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హథీరాంజీ మఠంలో ఉద్యోగం చేస్తున్న కార్తీక్ అనే యువకుడు కత్తితో గొంతుకోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు.

దీంతో తీవ్ర రక్తస్రావం కావడంతో స్థానిక రుయా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం కార్తీక్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.