FbTelugu

భార్యకు శీల పరీక్ష… భగ్గుమన్న మహిళా సంఘాలు!

ముంబయి: ఉస్మానాబాద్ జిల్లా పరాండలో కచాపూరి చౌక్ లో ఒక కారు డ్రైవర్ తన భార్యకు శీల పరీక్ష నిర్వహించాడు. భర్త సలసల కాగే నూనెలో చేతులు పెట్టించి ఆమె ప్రాతివ్రత్యాన్ని పరీక్షించిన ఘటనపై మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.
ఈ నెల 11 వ తేదీన భార్యాభర్తలకు గొడవ జరగడంత కోపంతో భార్య ఇంటి నుంచి వెళ్లిపోయింది. కారు డ్రైవర్ అయిన ఆమె భర్త ఆచూకీ కనుగొనేందుకు నాలుగు రోజుల పాటు తిరిగినా లభ్యం కాలేదు. ఐదో రోజు భార్య ఫోన్ చేసి ఇంటికి వచ్చింది. ఐదు రోజులు ఎక్కడ ఉన్నావంటూ ఆరా తీయగా అసలు విషయాలను పూసగుచ్చి వాస్తవం చెప్పింది. తను ఇంటి నుంచి నేరుగా కచాపూర్ చౌక్ కు వెళ్లి అక్కడ బస్సు కోసం ఎదురు చూస్తు నిల్చున్నాను.

ఈలోపు ఇద్దరు వ్యక్తులు వచ్చి బైక్ పై ఎక్కించుకుని పోయారు. నాలుగు రోజులు తమ వద్దే ఉంచుకున్నారని, బలత్కారం చేయలేదని చెప్పింది. వారి బారి నుంచి ఐదో రోజు తప్పించుకుని బయటపడి ఇంటికి వచ్చానని చెప్పింది.
ఆమె చెప్పిన విషయాలను నమ్మని భర్త ఆమెకు శీల పరీక్ష చేయాలని నిర్ణయించాడు. సలసల కాగే నూనెలో ఐదు రూపాయల బిళ్లలు వేసి దాన్ని చేయితో తీయాలని షరతు పెట్టాడు. ఈ క్రమంలో ఆమెకు గాయాలు కావడంతో దూరం జరిగింది. ఈ ఘటనను మొత్తం వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇతని తీరుపై మహిళా సంఘాలు, మేధావులు, రాజకీయ నాయకులు మండిపడ్డారు. ఈ వీడియోను చూసిన శాసన మండలి ఛైర్ పర్సన్ నీలం గోర్హూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ, కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.