FbTelugu

టెర్రరిస్టు కన్నా దారుణంగా చూస్తున్నారు: మౌనిక

హైదరాబాద్: బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి భూమా అఖిలప్రియ పట్ల తెలంగాణ పోలీసులు దారుణంగా ప్రవర్తిస్తున్నారని ఆమె సోదరి భూమా మౌనికా రెడ్డి ఆరోపించింది.

జైలులో ఆమె పట్ల టెర్రరిస్టుల కన్నా హీనంగా ప్రవర్తిస్తున్నారని, కనీసం భోజనం కూడా పెట్టడం లేదని ఆమె ఆరోపించింది. జైలు నుంచి ఆమె క్షేమంగా తిరిగి వస్తుందా లేదా అనే భయం వేస్తున్నదని అన్నారు. ఇవాళ మీడియాతో మాట్లాడుతూ, ఈ పరిణామాలన్నీ గమనిస్తే రాజకీయ ప్రేరేపితం అని అర్థమవుతుందన్నారు. ఈ కేసులో తొలుత మామయ్య ఏవి.సుబ్బారెడ్డి పేరు పెట్టి, ఆ తరువాత కేసు నుంచే తప్పించారన్నారు.

తమ కుటుంబంపై రెండు రాష్ట్రాల్లో రాజకీయ వేధింపులు జరుగుతున్నాయన్నారు. తల్లిదండ్రులు లేని పిల్లలనే కసితో తమపై వ్యక్తిగతంగా కక్ష పెంచుకున్నారని మౌనిక ఆరోపించింది. మేము కర్నూలు వాసులం అయినా హైదరాబాద్ లోనే పుట్టి పెరిగామని, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి హఫీజ్ పేటలోని భూమి మా ఆధీనంలో ఉందన్నారు. అప్పుడప్పుడు నాన్న భూమా నాగిరెడ్డి ఆ భూమి వద్దకు తీసుకువెళ్లేవారన్నారు.

మమ్మల్ని సెటిలర్లుగా, ఫ్యాక్షనిస్టులుగా చూపిస్తున్నారని, మా అక్క పట్ల కూడా అదే విధంగా ప్రవర్తిస్తున్నారని మౌనిక ఆవేదన వ్యక్తం చేసింది. ఇక మా బావ భార్గవ రామ్ వస్తే ఏం చేస్తారో అంటూ ఆందోళన వ్యక్తం చేసింది. స్థలం తనదేనంటున్న సీఎం కేసీఆర్ బంధువు ప్రవీణ్ రావు హెల్త్ రిపోర్టులు ఎందుకు కోర్టులో సమర్పించలేదని ఆమె ప్రశ్నించింది. ఈ విషయంలో కేసీఆర్ జోక్యం చేసుకుని పరిష్కరించాలని మౌనిక మీడియా ముఖంగా కోరింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.