FbTelugu

సాయంత్రం 5 గంటలకే బేగంబజార్ బంద్

హైదరాబాద్: దేశంలో కరోనా కేసుల ఉధృతి అధికంగా ఉండడంతో బేగం బజార్ లో సాయంత్రం 5 గంటలకే మార్కెట్లను మూసివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వ్యాపారులు తెలిపారు.

ఈ నిర్ణయం శుక్రవారం నుంచి అమలులోకి వస్తుందని, ప్రజలు, దూర ప్రాంతాల నుంచి వచ్చే రిటేల్ వర్తకులు గమనించాలని కోరారు. గతేడాది కూడా కరోనా కేసులు అధికంగా ఉన్న సమయంలో సాయంత్రం 5 గంటలకే మూసివేశామని గుర్తు చేశారు. ప్రజల ఆరోగ్యం, ప్రభుత్వ చర్యలకు మద్దతు పలికేందుకే సాయంత్రం 5 గంటల వరకు వ్యాపారం నడపనున్నట్లు ద హైదరాబాద్ కిరాణా మర్చంట్స్ అసోసియేషన్ తెలిపింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.