FbTelugu

ముందే పలకరించిన తొలకరి

యాదాద్రి బాలాలయం జలమయం

హైదరాబాద్: తెలంగాణ తో పాటు ఆంధ్రా లో పలు ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం రాత్రి మొదలైన వర్షాలు అక్కడక్కడ కురుస్తుండడంతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది.

చందానగర్ లో 4.2 సెంటీ మీటర్లు, మాదాపూర్ లో 5 సె.మీ, గచ్చిబౌలిలో 4.6 సె.మీ చొప్పున వర్షం కురిసింది. భద్రాచలం, సిద్దిపేట, యాదాద్రి జిల్లాల్లో కూడా జోరుగా వర్షం కురుస్తున్నది. యాదాద్రిలో ఉదయం కురిసిన వర్షానికి బాలాలయంలోకి పెద్ద ఎత్తున నీరు చేరుకోవడంతో మోటారు పంపులను ఏర్పాటు చేసి తోడుతున్నారు. బాలాలయం చిన్నపాటి తటాకాన్ని తలపిస్తున్నది. విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారి నకిరేకల్, చిట్యాల ప్రాంతంలో రోడ్డు జలమయం అయ్యింది. ఏపిలోని కడప జిల్లాలో రాత్రి నుంచి వర్షం కురుస్తునే ఉంది. కమలాపురం, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, వేంపల్లి, బొక్కలంక, కత్తులూరు, రామిరెడ్డిపల్లె, నాగురు లో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నారు. పలు ప్రాంతాల్లో వేరుశనగ పంట నీట మునిగింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.