FbTelugu

మా వ్యాక్సిన్ తో రెండేళ్లు బేఫికర్…

పారిస్: మా కంపెనీ తయారు చేసిన వ్యాక్సిన్ తీసుకున్న వారిలో కరోనా వైరస్ నుంచి రెండేళ్ల వరకు రక్షణ కల్పిస్తుందని మోడెర్నా కంపెనీ ప్రకటించింది.
మెసెంజర్ ఆర్ఎన్ఏ సాంకేతికతతో తయారు చేసిన ఈ వ్యాక్సిన్ 94.5 శాతం సమర్థత చూపించిందని ఇదివరకే ప్రకటించామని కంపెనీ సీఈఓ స్టిఫెన్ బాన్సెల్ తెలిపారు.

వ్యాక్సిన్ వల్ల మానవ శరీరాల్లో ఉత్పత్తి అయిన యాంటీ బాడీలు అత్యంత నెమ్మదిగా క్షీణిస్తాయని, దీంతో రెండేళ్ల పాటు రక్షణ ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. ఇటీవల బ్రిటన్, సౌత్ ఆఫ్రికా దేశాల్లో విస్తరిస్తున్న స్ట్రెయిన్ వైరస్ ను మోడెర్నా వ్యాక్సిన్ సమర్థవంతంగా ఎదుర్కొంటున్నదని ఆయన వివరించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.