FbTelugu

వ్యాక్సిన్ కోసం బీరు ఫ్రీ ఆఫర్

గుర్గాంవ్: వ్యాక్సిన్ ను ప్రోత్సహించేందుకు ఒక బార్ యజమాని విన్నూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. తాజాగా దేశంలో 1 లక్షా 45వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

అయితే వ్యాక్సిన్ వేయించుకునేందుకు జనాలు పెద్దగా ఆసక్తి చూపించడం లేదని గమనించిన ఒక బార్ యజమాని బంపర్ ఆఫర్ ప్రకటించాడు. వ్యాక్సిన్ లగావో.. బీర్ లేజావో అంటూ బోర్డు పెట్టేశాడు. ఇండియన్ గ్రిల్ రూమ్ రెస్టారెంట్ ప్రకటించిన ఈ బంఫర్ ఆఫర్ చూసి పలువురు యువకులు ఆశ్చర్యపోయారు. ఏప్రిల్ 5వ తేదీ నుంచి వారం రోజుల పాటు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. వ్యాక్సినేషన్ ను ప్రోత్సహించేందుకే ఈ ఆఫర్ ప్రకటించినట్లు బార్ యజమాని తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.