FbTelugu

తేనెటీగల దాడి.. తప్పించుకున్న చిరు, రామ్

కామారెడ్డి: దోమకొండ కోటలో రిటైర్డ్ ఐఏఎస్ ఉమాపతి రావు అంత్యక్రియల్లో తేనెటీగల గుంపు దాడి చేసింది. దీంతో ఒక్కసారిగా అందరూ ఉరుకులు, పరుగులు తీశారు.

అయితే ఈ ప్రమాదం నుంచి చిరంజీవి, రామ్ చరణ్ తప్పించుకున్నారు. హీరోలు చిరంజీవి, రామ్ చరణ్ తో పాటు ఉపాసన, కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఉపాసన తాత కామినేని ఉమాపతి రావు పార్థివ దేహాన్ని బయటకు తీసుకువస్తుండగా ఈ ఘటన జరిగింది. అంత్యక్రియలు ఇవాళ మధ్యాహ్నం నిర్వహించారు.

సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తం చేయడంతో చిరంజీవి, రామ్ చరణ్, ఉపాసనలు లోపలికి వెళ్లడంతో ప్రమాదం తప్పింది. ఈ తేనేటీగల దాడిలో కొందరికి స్వల్ప గాయాలయ్యాయి. వీరిని ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.

You might also like