FbTelugu

ఏపి పై నిషేధానికి బాబే కారణం: వైసిపి

అమరావతి: రాష్రంలో కరోనా వైరస్ కొత్త వేరియంట్‌ అంటూ అసత్య ప్రచారాలు చేసినందు వల్ల ఇప్పటికే ఢిల్లీ, ఒడిశా ప్రభుత్వాలు.. ఏపీ, తెలంగాణ ప్రజల ప్రయాణాలపై నిషేధం విధించాయని వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు.

రాష్ట్రంలో కోవిడ్‌ కట్టడిపై మాజీ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు విషప్రచారం చేస్తున్నారన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎన్‌440కే స్ట్రెయిన్‌ అనే అభూత కల్పనను చంద్రబాబు సృష్టించారని ఆయన విమర్శించారు. రాజకీయం కోసమే ఇలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పక్కరాష్ట్రంలో కూర్చొని ఏపీని చంద్రబాబు ఏం చేయాలనుకుంటున్నారని రామకృష్ణారెడ్డి నిలదీశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.