FbTelugu

గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంటి

సిద్దిపేట: జిల్లాలోని కోహెడలో ఓ ఎలుగుబంటి తీవ్ర కలకలం రేపింది. పెద్ద సముద్రాలగూడెం అనే గ్రామంలోని పోచమ్మ గుడిలో ఎలుగుబంటి ప్రవేశించడంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురైనారు.

అనంతరం అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. గతంలో కూడా గుడిలోని కొబ్బరి చిప్పలు తినేందుకు పలు సార్లు వచ్చినట్టు గ్రామస్తులు తెలిపారు. గుడి తలుపులు మూసి ఎలుగును పట్టుకున్నట్టు అధికారులు తెలిపారు.

You might also like