FbTelugu

ఐపీఎల్ నిర్వహణకే బీసీసీఐ మొగ్గు

న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా ఐపీఎల్ కు ఉన్న క్రేజు అంతా ఇంతా కాదు. కరోనా నేపథ్యంలో ఐపిఎల్ నిర్వహణపై క్రికెట్ అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కాగా ఇలాంటి తరుణంలో బీసీసీఐ మాత్రం ఐపీఎల్ నిర్వహణకే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది.

ఈ ఏడాది సెప్టెంబర్ 26 నుంచి నవంబర్ 8 మధ్య ఐపీఎల్ నిర్వహించాలని చూస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఒక వేళ మ్యాచులు నిర్వహిస్తే మొత్తం మ్యాచులను ముంబయిలోనే నిర్వహించాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. దేశంలో కరోనా కేసులు తీవ్రంగా పెరిగిపోతున్న నేపథ్యంలో ఐపీఎల్ నిర్వహిస్తారా, లేదా అన్నది మాత్రం ప్రశ్నార్థకంగానే మిగిలిపోతోంది.

You might also like