FbTelugu

అమానుషం… ఇంటి చుట్టూ ముళ్ల కంచె

కృష్ణా: నూజివీడు సమాచార పౌర సంబంధాల (ఐ అండ్ పీఆర్) విభాగంలో పనిచేస్తున్న సౌరీ ప్రసాద్ అనారోగ్యంతో గత నెల 30న చికిత్సకోసం విజయవాడలోని ఒక హాస్పిటల్ లో చేరారు.
ఈ విషయం తెలుసుకున్న కొందరు ఆయన స్వగ్రామమైన ముసునూరు లో ప్రసాద్ ఇంటికి ఎవరు వెళ్లకుండా ముళ్ళ కంచె వేశారు. హాస్పిటల్ లో ఎందుకు చేరాడు, ఏ రోగం వచ్చిందనే విషయం తెలుసుకోకుండానే కొందరు పనిగట్టుకుని కంచె వేయించారు. ఇంట్లోకి వెళ్లేందుకు ప్రసాద్ కుమారుడు ప్రయత్నించగా స్థానికులు అడ్డుకున్నారు. దీనిపై ఆయన కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా గ్రామానికి చేరుకున్నారు. పోలీసుల గ్రామస్థులకు సర్ధి చెబుతున్నారు.

You might also like