FbTelugu

ఏపీలో రేపటి నుంచే బార్లు బార్లా

అమరావతి: రాష్ట్రంలో బార్లను తెరుచుకునేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం ఉన్న బార్ల లైసెన్సులను కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

రేపటి (శనివారం)నుంచి బార్లు తెరుచుకునేందుకు అనుమతించారు. రాష్ట్రంలో మొత్తం  840 లైసెన్సులనూ కొనసాగించాలని అబ్కారీ శాఖ నిర్ణయించింది. 2021 జూన్ 30 వరకు బార్లను కొనసాగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. లైసెన్సు రిజిస్ట్రేషన్ చార్జీలను 10 శాతం మేర పెంచారు. లైసెన్స్ పై 20 శాతం కోవిడ్ ఫీజులు వసూలు చేయనున్నారు. విదేశీ మద్యం, దేశంలో తయారైన విదేశీ మద్యం, బీర్లు, రెడీ టు డ్రింక్ మద్యంపైనా 10 శాతం మేర ఏఈఆర్టీ విధిస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.