FbTelugu

అబుదాబిలో వేగంగా హిందూ మందిరం నిర్మాణం

అబుదాబి: అరబ్బు దేశం లో వందల కోట్ల రూపాయలు వెచ్చించి హిందూ దేవాలయం నిర్మాణం చేస్తున్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) రాజధాని నగరం అబుదాబిలో మొట్ట మొదటి దేవాలయం నిర్మిస్తున్నారు.

బోచసన్వాసి శ్రీ అక్షర్ పురుషోత్తం స్మినారాయణ్ సంస్థ (బిఎపిఎస్) అబుదాబిలోని అల్ రహబా సమీపంలోని అబుమురేఖిలో హిందూ మందిరం సిద్ధమవుతున్నది. రూ.880 కోట్లతో  సామాజిక, సాంస్కృతిక, వారసత్వ హిందూ మందిరాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఈ భారీ సముదాయంలో ప్రార్థనా మందిరం, సందర్శకుల హాలు, ప్రదర్శన కేంద్రం, క్రీడా ప్రాంతం, ఉద్యానవనం, గ్రంథాలయం, ఫుడ్ కోర్టులు, దుకాణాల సముదాయం ఏర్పాటుచేస్తున్నారు.

2015లో ప్రధాని నరేంద్ర మోదీ యూఏఈ పర్యటన సందర్భంగా భూమి కేటాయించేందుకు అక్కడి రాజు షేక్ మహ్మద్ బిన్ జాయెడ్ అల్ నహ్యాన్ హామీ ఇచ్చారు. 14 ఎకరాల భూమి కేటాయించడంలో 2018 ఫిబ్రవరి 11న మందిరం నిర్మణానికి శంకుస్థాపన చేశారు. మందిరం నిర్మాణ పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయని, ఏప్రిల్ నాటికి పునాది పనులు పూర్తి కానున్నాయని ప్రాజెక్టు ఇంజనీరు కొండేటి అశోక్ తెలిపారు. ఈ పనులు పూర్తి కాగానే స్టోన్ తో భవన నిర్మాణం జరుగుతుందని చెప్పారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.