FbTelugu

మీడియాను నిషేధించడం అప్రజాస్వామ్యం: చంద్రబాబు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతకాల సమావేశాలకు అసెంబ్లీ ప్రాంగణంలోని మీడియా పాయింట్ ను తొలగించడం అప్రజాస్వామికమని టీడీపీ జాతీయాధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు.

మీడియా పాయింట్ ను తొలగించడం పట్ల చంద్రబాబు ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంకు లేఖ రాశారు. ఆ లేఖలో పలు అంశాలు లేవనెత్తారు. చట్ట సభల్లో ఏంజరుగుతోందో ప్రజలకు తెలియకుండా ఉండేందుకు మీడియాను నిషేధించడం రాజ్యాంగస్ఫూర్తికి విరుద్ధమని స్పష్టం చేశారు. గతంలోనూ మీడియా హక్కులను హరించేలా వ్యవహరిస్తే దేశవ్యాప్తంగా వ్యతిరేకత వచ్చిందని అన్నారు. అన్ని మీడియా సంస్థలకు చట్టసభల ప్రత్యక్ష ప్రసార అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.