FbTelugu

ఇక అకౌంటులో డబ్బుపోతే బ్యాంకులదే బాధ్యత!

బ్యాంకు అకౌంట్లలో కొన్ని సార్లు ఖాతాదారులకు సంబంధం (ప్రమేయం) లేకుండానే డబ్బు పోవడం వంటి ఘటనలు చూస్తుంటాం. ఇకపై అలాంటి ఘటనలు జరిగితే ఇక పూర్తి బాధ్యత సదరు బ్యాంకులే వహించాల్సి ఉంటుంది. వివరాల్లోకెళితే.. ఖాతాదారులకు సంబంధించిన డెబిట్, క్రెడిట్ కార్డు నుంచి ఎటువంటి ఆదేశాలు లేకుండా లావాదేవీలు జరిగినా.. అకౌంట్ కానీ, కార్డులు కానీ హ్యాక్ అయి డబ్బు కట్ అయితే పూర్తి బాధ్యత బ్యాంకులదేనని ఆర్బీఐ స్పష్టం చేసింది. జాతీయ వినియోగదారుల కమిషన్ గతంలో.. ఖాతాదారుడి నగదు అతడి ప్రమేయం లేకుండా వినియోగిస్తే దానికి బ్యాంకులే బాధ్యత వహించాలంటూ తీర్పును ఇచ్చింది.

దానికి ఆర్బీఐ సైతం అంగీకరిస్తూ కొన్ని నియమ నిబంధనలు సైతం 2018లో రూపొందించింది. బ్యాంకు నుంచి పొరపాటు, బ్యాంకింగ్ వ్యవస్థలోని లోపాల కారణంగా తప్ప జరిగితే అప్పుడు కస్టమర్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, మొత్తం నష్టాన్ని బ్యాంకులే భరించాలని తెలిపింది. బ్యాంకు ఖాతా లావాదేవీల్లో కస్టమర్ నిర్లక్ష్యం కారణంగా మోసం జరిగితే అప్పుడు కస్టమర్ నష్టాన్ని భరించాల్సి ఉంటుందని, ఒక వేళ కస్టమర్ తప్పు లేదా బ్యాంకు తప్పు లేని పరిస్థితిలో మోసం జరిగిన 3 పని దినాలలోపు బ్యాంకుకు ఫిర్యాదు చేయాలని సూచించింది. సమయంలో, 4-7 రోజుల్లో ఫిర్యాదు చేస్తే, కస్టమర్ 5000 – 25000 రూపాయలు పొందే వెసులుబాటును కల్పించింది. 7 పనిదినాల తర్వాత కస్టమర్ తనకు జరిగిన మోసాన్ని గుర్తించి ఫిర్యాదు చేస్తే, అటువంటి సందర్భాలలో బ్యాంక్ విధానం ఏమిటో దానిపై ఆధారపడి ఉంటుందని స్పష్టం చేసింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.