FbTelugu

ఇకనుంచి బ్యాంకులు 4 గంటలే…

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా లాక్‌డౌన్‌.2 నేపథ్యంలో బ్యాంకుల పనివేళల్లో మార్పులు చేశారు. రేపటి (గురువారం) నుంచి ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు బ్యాంకులు పనిచేయనున్నాయి.

బ్యాంక్‌లో 50% సిబ్బందితో తొమ్మిది రోజుల పాటు సేవలు అందించనున్నారు. ఈ నెల 20 వరకు ఈ పనివేళలు కొనసాగుతాయి. రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ లాక్ డౌన్ పొడిగిస్తే ఆ ప్రకారం బ్యాంకులు కూడా పొడిగించే అవకాశాలు ఉన్నాయి. ఈ వేళల్లో ఖాతాదారులు తమ సేవలను ఉపయోగించుకోవాలని కోరింది. వీలైనంత మేరకు బ్యాంకు బ్రాంచికి రాకుండానే పని పూర్తయ్యేలా చూసుకోవాలని బ్యాంకులు వినతి చేశాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.