FbTelugu

బంజారాహిల్స్ పోలీసుల గజగజ

హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో మరికొందరికి కరోనా పాజిటివ్ రావడంతో సిబ్బంది హడలిపోతున్నారు.

తాజాగా ఒక ఏఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లు, ఇద్దరు హోం గార్డులు కరోనా బారిన పడ్డారు. ఇప్పటికే ఇదే పోలీస్ స్టేషన్ లో 10 మంది కరోనా పాజిటివ్ బారిన పడ్డ విషయం తెలిసిందే. కొత్తగా మరో ఐదు మంది కి పాజిటివ్ రావడంతో మిగిలిన సిబ్బంది వణికిపోతున్నారు. ఈ స్టేషన్ లో మొత్తం 135 మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖులు, వ్యాపారవేత్తలు, వీఐపీలు ఈ స్టేషన్ పరిధిలో నివసిస్తున్నారు.

You might also like